
ఒంగోలు అర్బన్: ఓటర్ల జాబితా సవరణ కోసం ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఎల్‌వోలు తప్పనిసరిగా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా శుక్రవారం జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కే శ్రీనివాసులు పాల్గొన్నారు. దీనిలో జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ సీఈఓకు వివరించారు. ప్రత్యేక క్యాంపులకు బీఎల్‌ఓలు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబర్ 27వ తేదీ విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారు 14 వేల మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 24 వేలకు పెరిగిందన్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో 301 మందిని సెక్టార్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. జిల్లాకు 1.71 లక్షల ఎపిక్ కార్డులు చైన్నె నుంచి ప్రిట్ అయ్యి రావాల్సి ఉందన్నారు. జిల్లాలో అనామలీస్ వెరిఫికేషన్ మరో 500 ఇళ్లు, 1387 ఓట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ నెల 5వ తేదీలోపు వాటిని పూర్తి చేస్తామని, అనామలీస్‌పై జాయింట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఈఓ చెప్పారు. దీనిలో జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్