
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వంద ఎకరాలు కాదు..వంద గజాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చూపించినా తను దేనికైనా సిద్ధమేనని ఎంపీ మాలోతు కవిత సవాల్ చేశారు. అసెంబ్లీలో మీడియాతో శనివారం మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డికి పిచ్చిలేచి బలుపుతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌లో రేవంత్‌రెడ్డికి విమర్శలు చేయాలంటే మేము తప్ప ఎవరూ కనిపించడం లేదన్నారు.
మా నాన్న నిజాయితీగా రాజకీయాలు చేశారని, అందుకే ఏడుసార్లు జనరల్ సీటు గెలిచారని గుర్తు చేశారు. అవినీతి, అక్రమాలు చేయడం మా కుటుంబంలోనే లేదని స్పష్టం చేశారు. తాము అక్రమాలు అన్యాయాలు చేస్తే ప్రజలు ఇన్నిసార్లు గెలిపించరనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. రాజకీయంగా ఎమ్మెల్యే హరిప్రియతో ఎలాంటి విభేదాలు లేవని, ఆమెకు అన్ని విధాలుగా సహకరిస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన విధంగానే పార్లమెంట్‌లో కేంద్రంపై పోరాటం చేస్తామనన్నారు.