
‘కమిటీలను మీరెలా ఖరారు చేస్తారు?’
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండల, పెద్దపల్లి పట్టణ కమిటీలను ఎలా ప్రకటిస్తారని ప్రభారీలు జంగ చక్రధర్‌రెడ్డి, నారాయణస్వామి ప్రశ్నించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో నాయకులు పల్లె సదానందం, పర్శ సమ్మయ్య, జ్యోతిబసు, మౌటం నర్సింగం, రాజేంద్రప్రసాద్, బెజ్జంకి దిలీప్‌తో కలిసి మాట్లాడారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్ తీరు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆరోపించారు. కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డిలు కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ సహకారంతో పార్టీని బలో పేతం చేస్తుంటే వారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్టీ మండల, పట్టణ కమిటీలను పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. ఇక మీదట అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తే ఊరుకోబోమన్నారు.