
అందుబాటులో యూరియా
జూలపల్లి(పెద్దపల్లి): వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి దోమ ఆదిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఎరువుల నిల్వలు, ఆగ్రోస్, ప్రైవేటు ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయాధికారి ప్రత్యూషతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 106 టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని, మరో 1,394 టన్నులు ఈ సీజనుకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మండలంలోని రైతులకు 57 మెట్రిక్ టన్నుల యూరియా, 103 టన్నుల కాంప్లెక్స్, 11 టన్నుల పోటాష్, 13 టన్నుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆందుబాటులో ఉందని చెప్పారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సొసైటీ సీఈవో సురేశ్ తదితరులు ఉన్నారు.