
బర్తన్ బ్యాంకులు ఏర్పాటు చేయండి
కోల్‌సిటీ/జ్యోతినగర్: ప్లాస్టిక్ వస్తువుల వినియోగా న్ని నియంత్రించడానికి స్టీల్ వస్తువులను అందుబాటులో ఉంచే బర్తన్ బ్యాంకుల ఏర్పాటుకు స్వశక్తి సంఘాల మహిళలు ముందుకు రావాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి కోరా రు. వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం బర్తన్ బ్యాంకును ఆయన సంద ర్శించారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్టీల్ వస్తువులను వినియోగించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసే బర్తన్ బ్యాంకులతో స్వశక్తి మహిళలకు ఉపాధి కూ డా లభిస్తుందన్నారు. అనంతరం గోదావరిఖని బ స్టాండ్ వద్ద చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్లపై ఆరా తీశా రు. గాంధీనగర్ వంకబెండు సమీపంలో కూరగా యలు, వీధివ్యాపారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పీఎం స్వనిధి గురించి అవగాహన కల్పించారు. ఓల్డ్ అశోక టాకీస్ ప్రాంతంలో గోడలపై చి త్రీకరిస్తున్న సందేశాత్మక చిత్రాలను పరిశీలించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, సీవోలు ఊర్మిళ, ప్రియదర్శిని ఉన్నారు.
బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి