
ఆస్పత్రి ఆధునికీకరణకు చర్యలు
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్(ఎస్‌ఎన్‌సీయూ) ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జీజీహెచ్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట్రాక్ట్ సూపర్‌వైజర్ వేధింపులపై నర్సింగ్ ఆఫీసర్లు కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ పరిశీస్తానన్నారు. డ్రగ్స్‌స్టోర్, ల్యాబ్ వైద్య పరీక్ష రికార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చే యాలన్నారు. గంట సమయంలోనే వ్యాధి నిర్ధారణ ఫలితాలు ఇవ్వాలని ఆదేశించారు. జీజీహెచ్ ఆవరణలో రూ.142 కోట్లతో నిర్మిస్తున్న 355 పడకల భవనం పనులను నవంబర్ వరకు పూర్తి చే యాలని సూచించారు. సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్, ఆర్‌ఎంవో రాజు పాల్గొన్నారు.
ఇళ్ల పట్టాలు సిద్ధం చేయండి
రామగుండంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, ఇళ్లపట్టాలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి డబుల్‌బెడ్రూమ్ ఇళ్లపై సమీక్షించారు. టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ఉర్దూ మీడియం పాఠశాల అభివృద్ధి పూర్తి కావాలని ఆయన అన్నారు. ఆర్డీవో గంగయ్య, బల్దియా ఈఈ రామన్ పాల్గొన్నారు.
యాంటీ డ్రగ్ సోల్జర్
పెద్దపల్లిరూరల్: మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో చేపట్టిన మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఫొటో పాయింట్ వద్ద ‘ఐ యాం యాంటీ డ్రగ్ సోల్జర్’గా ఫొటో దిగారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వారికోసం ప్రభుత్వం పునరావాసకేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబరు14446కు సమాచారం అందించాని ఆయన కోరారు.
పాఠశాలల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు
సుల్తానాబాద్(పెద్దపల్లి): పాఠశాలల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంఈవో రాజయ్య, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ దేవేందర్, ఏఈ సచిన్, హెడ్‌మాస్టర్ శారద తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ స్టోర్, ల్యాబ్ రికార్డుల డిజిటలైజేషన్
గంటలోగా వ్యాధి నిర్ధారణ నివేదికలు
కలెక్టర్ కోయ శ్రీహర్ష : జీజీహెచ్ ఆకస్మిక తనిఖీ

ఆస్పత్రి ఆధునికీకరణకు చర్యలు