
బట్టీ యజమానిపై చర్యలు తీసుకోవాలి
సుల్తానాబాద్/ఎలిగేడు: చిన్నపిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఇటుకబట్టీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని దళిత బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి కై లాసం శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్‌కు విన్నవించారు. పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామంలో పీవీసీ ఇటుకబట్టీలో యజమాని వెంకన్న చిన్నపిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. బట్టీలో బాలలతో ఎందుకు పని చేయిస్తున్నారని ప్రశ్నించినందుకు తనను కులంపేరుతో దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని సభ్యుడికి తెలిపారు. కమిషన్ సభ్యులు సానుకూలంగా స్పందించినట్లు కై లాసం తెలిపారు. అలాగే కమిషన్ సభ్యుడు రాంచందర్‌ను ఎలిగేడులో మాజీ ఎంపీపీ కవ్వంపల్లి లక్ష్మీదుర్గయ్య, లాలపల్లి మాజీ సర్పంచ్ బాసంపల్లి కొండయ్య, బాలి శ్రీనివాస్ సన్మానించారు.