
సనత్ తల్లిని ఓదార్చుతున్న కళాశాల సిబ్బంది
బలవన్మరణం చెందిన మెడికల్ కళాశాల విద్యార్థి మోసం సనత్ మొదటి నుంచి చదువులో ముందంజలో ఉన్నాడు. 2016లో పదో తరగతిలో 9.2 జీపీ, ఇంటర్‌లో 977 మార్కులు, ఆల్ ఇండియా నీట్‌లో 82,097 ర్యాంక్ సాధించాడు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం వరకు చదువులో ముందంజలో ఉన్నాడు. ఇటీవల ఫైనల్ పరీక్షలు రాశాడు. శనివారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. గురువారం స్నేహితులతో సరదాగా గడిపిన సనత్ సినిమాకు వెళ్లాడు. సాయంత్రం క్రికెట్ ఆడాడు. అంతలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అందరితో కలిసిమెలిసి ఉండే సనత్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంపై స్నేహితులు, తోటి మెడికోలు బోరున విలపించారు.