
చెవి కమ్మలు అందిస్తున్న కంట్రోలర్ కేఆర్ రెడ్డి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు నష్టపోయిన పంటల వివరాలు, రైతులపేర్లు, బ్యాంకుఖాతా వివరాలను ఈ నెల 3లోగా సమర్పించాలని కలెక్టర్ సంగీత సంబంధిత వ్యవసాయాధికారులను ఆదేశించారు. వానలకు 33శాతం నష్టపోయిన పంటల వివరాలను మాత్రమే నివేదించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, ఆ వివరాల ఆధారంగా ఎకరానికి రూ.10వేల పరిహారం అందించాలని సీఎం నిర్ణయించారని వివరించారు. ఇప్పటివరకు 6,911 ఎకరాల్లో జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఏఈఓలు తమ క్లస్టర్ పరిధిలో పూర్తివివరాలను ఈనెల 3లోగా అందించాలని కలెక్టర్ సంగీత అన్నారు. పంటలను కౌలురైతులే సాగు చేస్తే కౌలురైతుల బ్యాంకుఖాతా వివరాలనే అందించాలన్నారు. సమావేశంలో ఉద్యానవన అధికారి జగన్మోహన్‌రెడ్డి, ఏడీఏ శ్రీనాథ్, ఏఓ, ఏఈఓలు పాల్గొన్నారు.
ఇంటర్ బ్రిడ్జి పరీక్షలకు
695 మంది హాజరు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ బ్రిడ్జికోర్సు పరీక్షలకు గురువారం 695 మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. 771 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 76మంది గైర్హాజరయ్యారని, పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు.
నిజాయతీ చాటుకున్న మహిళా కండక్టర్
మంథని: మంథని ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ నిజాయతీ చాటుకుంది. మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన కాపురం రాజమ్మ బస్సులో బంగారు చెవికమ్మలు పోగొట్టుకుంది. కండక్టర్ సరితకు కమ్మలు దొరకడంతో బాధితురాలికి అందజేసింది. వివరాలు.. రాజమ్మ పెద్దపల్లి నుంచి మంథనికి బస్సులో ప్రయాణం చేసింది. బస్సు దిగిన తర్వాత చెవులకు కమ్మలు లేకపోవడంతో హైరానా పడింది. విషయం కంట్రోలర్ కేఆర్ రెడ్డికి తెలుపుగా సదరు బస్సు ముత్తారం మండలం ఓడెడుకు వెళ్తున్న క్రమంలో వెంటనే అప్రమత్తమై చెవి కమ్మలను వెతికి బాధితురాలికి అందజేశారు.
‘పది’ పరీక్షలకు
పకడ్బందీ ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఈనెల 3 నుంచి మొ దలయ్యే 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏ ర్పాట్లు చేసి సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్ సంగీత సంబంధిత అధికారులను ఆదేశించారు. టెన్త్ పరీక్షల ఏర్పాట్లు తదితర అంశాల పై కలెక్టర్ శుక్రవారం మాట్లాడారు. ఈనెల 3 నుంచి 13 వరకు జరిగే టెన్త్ పరీక్షల కోసం జి ల్లాలో 47 కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఆ యా కేంద్రాల్లో 7,937 మంది విద్యార్థులు హా జరవుతారని వివరించారు. కేంద్రాల వద్ద ఏ ఎన్‌ఎం ఆధ్వర్యంలో వైద్యబృందం అందుబా టులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పా టు చేశామని వివరించారు. సమస్యలు, సందేహాలకు కంట్రోల్ రూం నం. 86398 62145 ఫోన్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్ సంగీత