
మంత్రులచేతులమీదుగా అవార్డు అందుకుంటున్న సర్పంచ్ వెంకటేశ్వర్‌రావు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని సుల్తాన్‌పూర్ పంచాయతీ రాష్ట్రస్థాయిలో పచ్చదనం..పరిశుభ్రత అంశంలో ఉత్తమ పంచాయతీగా ఎంపికై ంది. ఉత్తమ సర్పంచ్‌గా ఎంపికై న సుల్తాన్‌పూర్ సర్పంచ్ వెంకటేశ్వర్‌రావుకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ పుట్టమధు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, డీఆర్‌డీవో శ్రీధర్ తదితరులున్నారు. ఎలిగేడు మండలంలోని సుల్తాన్‌పూర్ పంచాయతీ 1,2,5,9 అంశాల్లో ప్రతిభచూపి అగ్రభాగాన నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఎంపికై న సుల్తాన్‌పూర్ పంచాయతీ జాతీయస్థాయిలో అవార్డు కోసం పోటీపడుతోంది. పెద్దపల్లి జిల్లాకు మరోసారి సుల్తాన్‌పూర్ పంచాయతీ జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందన్న ఆశతో జిల్లావాసులు, అధికారులున్నారు.