
ర్యాలీలో పాల్గొన్న ఎంఎస్ రాజ్‌ఠాగూర్, కార్యకర్తలు
● కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
ఎంఎస్.రాజ్‌ఠాగూర్
గోదావరిఖని: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మోసపూరిత హామీలు, వాగ్ధానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్.రాజ్‌ఠాగూర్ అన్నారు. శుక్రవారం స్థానిక శారదానగర్‌లో పాదయాత్ర నిర్వహించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, నిరోద్యోగ భృతి, ఇలా ఎన్నోహామీలు ఇచ్చి మోసం చేశారన్నారు.
బ్రిటీష్ పాలనను మరిపిస్తోన్న బీజేపీ...
బ్రిటీష్ పాలనను మరిపించే తీరులో మోడీ పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే గొంతును అణిచివేయాలని బీజేపీ చూస్తోందని రాజ్‌ఠాగూర్ విమర్శించారు. ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాహుల్‌గాంధీని రాజకీయంగా అణగదొక్కేందుకే పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారన్నారు. బీజేపీ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ ప్రశ్నించే అవకాశం లేకుండా దొడ్డిదారిన ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను అందరూ ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఇఫ్తార్ విందు...
రామగుండం: పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీ మజీద్‌లో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఉపవాస దీక్షలు మతాల మధ్య బంధుత్వాన్ని పెంచుతాయని, స్నేహానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. ముస్లిం మతపెద్దలు మక్కాన్‌సింగ్‌ను రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదగాలని ఆశీర్వదించారు.