● కుట్రపూరితంగానే రాహుల్‌పై అనర్హత ● టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ | - | Sakshi
Sakshi News home page

● కుట్రపూరితంగానే రాహుల్‌పై అనర్హత ● టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌

Apr 1 2023 12:12 AM | Updated on Apr 1 2023 12:12 AM

గుర్తు తెలియని మృతదేహం  - Sakshi

గుర్తు తెలియని మృతదేహం

ప్రజాస్వామ్యాన్ని

ఖూనీచేస్తున్న బీజేపీ

పెద్దపల్లిరూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రజా స్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తోందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్‌ ఆరోపించారు. పెద్దపల్లిలో శుక్రవారం బి.రమేశ్‌గౌడ్‌ తో కలిసి సమావేశంలో మాట్లాడారు. దేశంలో జోడోయాత్రతో రాహుల్‌గాంధీకి పెరిగిన ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ పాలకులు కుట్రపూరితంగా రాహుల్‌పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దుచేశారన్నారు. ఆ దానీ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా దృష్టి మరల్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కాంగ్రెస్‌ ఎంతటి పోరాటాలైనా చేస్తోందన్నా రు. నాయకులు బి.సురేశ్‌గౌడ్‌, శ్యాం, శ్రీనివా స్‌, సునీల్‌గౌడ్‌, చంద్రశేఖర్‌, అక్బర్‌అలీ, సర్వ ర్‌, వేముల రాజు, పెర్కసంతోష్‌, విజయ్‌ తదితరులున్నారు

అనారోగ్య కారణాలతో వ్యక్తి ఆత్మహత్య

ఫెర్టిలైజర్‌సిటీ: ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గౌతమినగర్‌లో నివసిస్తున్న సోమారపు సుధాకర్‌(45) గురువారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్సపొందుతూ శుక్రవారం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతుడు నాలుగేళ్లుగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సోమారపు రేణుక ఫిర్యాదుతో ఎన్టీపీసీ ఎస్సై జీవన్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

నదిలో దూకేందుకు

యత్నించిన మహిళ

యైటింక్లయిన్‌కాలనీ: గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలో దూకేందుకు యత్నించిన ఓ మహిళను(29) శుక్రవారం రివర్‌ పోలీసులు కాపాడారు. టూటౌన్‌ రివర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని గాంధీనగర్‌ కుచెందిన ఓ వివాహిత కొంతకాలంగా కుటుంబ కలహాలతో బాధపడుతోంది. మ నస్థాపనికి గురై శుక్రవారం మధ్యాహ్నం గో దావరి బ్రిడ్జి వద్దకు వెళ్లి నదిలో దూకుతుండ గా అక్కడే విధులు నిర్వహిస్తున్న రివర్‌ కానిస్టేబుల్‌ సదానందం గమనించి సదరు మ హిళను అదుపులోకి తీసుకున్నారు. అనంత రం కౌన్సెలింగ్‌ నిర్వహించి వన్‌ టౌన్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. సమస్యల్లోంచి బయటపడడానికి ఆత్మహత్యలు పరిష్కా రం కాదని, ఆత్మహత్య చేసుకోవడం నేరమని టూటౌన్‌ సీఐ వేణుగోపాల్‌ మందలించారు.

మృతదేహం లభ్యం

యైటింక్లయిన్‌కాలనీ: గోదావరినదిలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరి నదిలో జాలర్లు చేపలుపడుతున్న క్రమంలో చేపలవలకు మృతదేహం చిక్కడంతో బయటకు తీశారు. మృతుడి జేబులోని ఆధార్‌కార్డు ప్రకారం శ్రీరాంపూర్‌కు చెందిన శ్రావణపూడి చిట్టి బాబుగా (50) టూటౌన్‌ పోలీసులు గుర్తించారు. మృతుడి పూర్తి వివరాలకు శ్రీరాంపూర్‌ పోలీసులకు సమాచారం అందించినట్లు టూటౌన్‌ ఎస్సై శ్యామ్‌పటేల్‌ తెలిపారు. మృతదేహన్ని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కాపాడిన రివర్‌ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement