
సమస్యలు తెలుసుకుంటున్న గొర్రె రమేశ్
పాలకుర్తి: రామగుండం నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేశ్ అన్నారు. శుక్రవారం పాలకుర్తి మండలకేంద్రంతో పాటు బసంత్‌నగర్, ఈసాలతక్కళ్లపల్లి, బక్కరాజంపల్లి గ్రామాల్లో ‘పల్లెబాట’ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గొర్రె రమేశ్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ఉన్నత చదువులకు విద్యార్థు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాల కుర్తి మండలకేంద్రంగా ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మండల కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించలేదని ఇది ఖచ్చితంగా అధికార పార్టీ నాయకుల అలసత్వమేనన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లేబర్ పార్టీ తరపున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యడ శివరాం, తిరుపతి, గాజుల రమేశ్, జక్కం కవిత, పొన్నం రజిత, అఖిల్‌వర్మ, మానస, సరిత తదితరులు పాల్గొన్నారు.