
మాట్లాడుతున్న డీఈఓ మాధవి
రామగుండం: మానవాళి మనుగడ సాధించాలంటే విద్యార్థులు తమ పుట్టిన రోజున మొక్క నాటాలని డీఈవో మాధవి సూచించారు. అంతర్గాం మండలం ముర్మూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ‘గోటూనేచర్’ ప్రకృతి శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే అడవుల రక్షణ, మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. జాతీయ హరితదళం రాష్ట్ర ప్రాజెక్టు అధికారి బి.విద్యాసాగర్, జిల్లా సమన్వయకర్త బి.రవినందన్‌రావు, కన్నాల ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సయ్యద్ రహ్మతుల్లా హుస్సేన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.