రైతు కోసం.. ఏం చేశారనీ!
న్యూస్‌రీల్
ప్రభుత్వ ప్రచారం కోసమే ‘రైతన్నా.. మీకోసం’ ఏడాదిన్నరలో అన్నదాతకు దగా పంటలకు నష్టపరిహారం కరువు అన్నదాత సుఖీభవ తొలి విడతకు ఎగనామం వేలాది మంది లబ్ధికి దూరం
శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2025
రైతులపై ప్రీమియం భారం లేకుండా 2019 ఖరీఫ్ నుంచి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను తీసుకువచ్చింది. ప్రతి ఎకరాకు బీమా వర్తించడంతో పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులతో పాటు కౌలు రైతులకు పూర్తి పరిహారం అందేది. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరిగింది. ప్రకృతి విపత్తుల సమయంలో అటు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వక.. ఇటు బీమా లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల సంభవించిన మోంథా తుపాను, అకాల వర్షాలు ఖరీఫ్ రైతుకు గట్టి దెబ్బ కొట్టాయి. వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, అరటి, బొప్పాయి వంటి ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. 33 శాతానికిపైగా నష్టం ఉంటేనే పరిహారం అందిస్తామన్న ప్రభుత్వ నిబంధన అన్నదాతకు శరాఘాతంగా మారింది.
రైతు కోసం.. ఏం చేశారనీ!


