
రోడ్లపై వదిలేస్తున్నారు
పశువులను రోడ్లపైనే వదిలి వేయడంతో అవి రోడ్లపై అడ్డంగా తిష్ఠ వేస్తున్నాయి. ఈ కారణంగా పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. దీనికి తోడు వాటికి సరైన మేత లేక సమీపంలో ఉన్న వ్యర్థాలను, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. పశువుల పోషణ సంరక్షణ యజమానులే బాధ్యతగా తీసుకోవాలి. వీధుల్లోకి రహదారుల పైకి యజ మానులు ఈ విధంగా విడిచిపెట్టడం సరికాదు. యజమానులకు కుదరకపోతే వాటిని సంబంధించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు అప్పగించాలి.
–వంగల దాలినాయుడు, జాతీయ మానవహక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు