
శ్యామలాంబ జాతరను విజయవంతం చేయాలి
● అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం టౌన్: సాలూరులో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న శ్యామలాంబ అమ్మవారి జాతరను విజయవంతం చేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ స్పష్టం చేశారు. జాతర నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో బుధవారం మాట్లాడారు. 15 ఏళ్ల తరువాత జరుగుతున్న అమ్మవారి జాతరకు భక్తులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉందన్నారు. జాతర జరిగే మూడు రోజులూ ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు విచ్చేసే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు.
●జాతర జరిగే నాలుగు రోజుల్లో నాలుగు జిల్లాలకు చెందిన 1240 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
●సిరిమాను తిరిగే ప్రాంతాలతో పాటు అన్ని ముఖ్య ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తుతో పా టు 30 రోప్ పార్టీలను సంసిద్ధం చేయాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భక్తులందరూ ఒకే ప్రాంతంలో గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాలూరు పట్టణ రహదారుల్లో గుర్తించిన 22 పాట్ హోల్స్‌ను తక్షణమే పూడ్చివేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.
●విద్యుత్ లోఓల్టేజీ సమస్య తలెత్తకుండా అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేశామని, సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్‌ను నిలిపివేస్తున్నామని, ఆ సమయంలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా కమిటీ సహకారంతో జనరేటర్లను ఏర్పాటుచేయనున్నట్లు ఎస్‌ఈ కలెక్టర్‌కు వివరించారు.
●14 వైద్య బృందాల ద్వారా 378 మంది వైద్య సిబ్బంది జాతర ముగిసే వరకు నిత్యం సేవలు అందించాలని, అంబులెన్సులు, మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశా రు. దేవాలయానికి అలంకరణ, క్యూలైన్లు, భక్తుల కు, చిన్నారులకు తాగునీరు, పాలు, మజ్జిగ వంటి ఏర్పాట్లతో పాటు మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని ఆలయ ఈఓను ఆదేశించారు. అధికారులందరూ వారికి అప్పగించిన విధులను బాధ్యతగా నిర్వర్తించి జాతరను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేసీ ఎస్.ఎస్.శోభిక, ఎస్డీసీ డా.పి.ధర్మ చంద్రారెడ్ది, ఆలయ ఈఓ టి.రమేష్, మండల ప్రత్యేక అధికారి శివన్నరాయణ, మున్సిప ల్ కమిషనర్ డి.టి.వి.కష్ణారావు, మండల తహసీల్దార్ ఎన్.వి.రమణ, ఎంపీడీఓ జి.పార్వతి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ కె.చలపతిరావు, డీపీఓ టి.కొండలరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎం.రవిప్రసాద్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, జిల్లా విపత్తు ల స్పందన అధికారి కె.శ్రీనుబాబు, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.