దక్షిణ భారతదేశ యాత్రకు ఐఆర్‌ సీటీసీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

దక్షిణ భారతదేశ యాత్రకు ఐఆర్‌ సీటీసీ ఏర్పాట్లు

May 15 2025 12:50 AM | Updated on May 15 2025 12:50 AM

దక్షిణ భారతదేశ యాత్రకు ఐఆర్‌ సీటీసీ ఏర్పాట్లు

దక్షిణ భారతదేశ యాత్రకు ఐఆర్‌ సీటీసీ ఏర్పాట్లు

పార్వతీపురం టౌన్‌: ఐఆర్‌ సీటీసీ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ‘భారత్‌ గౌరవ్‌‘ పేరుతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిందన్నారు.

ప్యాకేజీ వివరాలు ఇలా...

అరుణాచలం–మధురై రామేశ్వరం యాత్ర: ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగలు ప్రయాణంలో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులలో ఉన్న పుణ్యక్షేత్రాల దర్శనం కల్పిస్తారు. దీనికోసం ఒక్కో పర్యాటకుడు రూ.14,700 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

హరిద్వార్‌–రిషికేశ్‌ వైష్ణోదేవి యాత్ర: జూన్‌ 3 నుంచి 12వ తేదీ వరకు 9 రాత్రులు, 10 పగలు ప్రయాణంలో హరిద్వార్‌, రిషికేశ్‌, ఆనందపూర్‌, నైనా దేవి ఆలయం, అమృతసర్‌, మాతా వైష్ణోదేవి ఆలయాల సందర్శన ఉంటుంది. దీని కోసం రూ.18,510 చెల్లించాలి.

కాశి–అయోధ్య–ప్రయాగరాజ్‌ యాత్ర: జూన్‌ 14 నుంచి 22వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగలతో కూడిన కాశి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌, శ్రీంగవేరపురం ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం టికెట్‌ ధర రూ.16,200.

ఉజ్జయిని, త్రయంబకేశ్వర్‌–భీమశంకర్‌ ఘృష్టేశ్వర్‌: జూలై 5 నుంచి 23వ తేదీ వరకు 8 రాత్రులు, 9 పగలు ప్రయాణంలో మహాకాళేశ్వర్‌, ఓంకారేశ్వర్‌, త్రయంబకేశ్వర్‌, భీంశంకర్‌, ఘృష్టేశ్వర్‌, ఎల్లోరా, మోవ్‌, నాగ్పూర్‌తో యాత్ర కోసం పర్యాటకులు రూ:14,700 వరకు చెల్లించాలి. దక్షిణ భారతదేశ యాత్రలో రైలు, బస్సు, హోటల్‌ ఐఆర్‌ సీటీసీ ఏర్పాటు చేస్తుంది. ఉదయం అల్పాహారం, మధ్యా హ్నం, రాత్రి భోజనం, మంచి నీళ్ల బాటిల్స్‌, పర్యా టకుల ఆలయాల సందర్శన సమయంలో గైడ్‌ సేవలను ఐఆర్‌ సీటీసీ ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ప్రయాణికులకు ప్రయాణ సమయంలో బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. పూర్తి వివరాలకు 040–27702407, 97013 60701, 92814 95845, 92814 95843, 92810 30712, 92810 30740 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement