
● ఆస్పత్రులకు రోగుల తాకిడి
ప్రస్తుత వాతావరణం విభిన్నంగా ఉంది. ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పల్లెల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కలుషిత నీటిని తాగుతూ అస్వస్థతకు గురవుతున్నారు. మరికొన్నిచోట్ల పారిశుద్ధ్య నిర్వహణ లోపించి దోమకాట్లతో జ్వరాల బారిన పడుతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్తున్నారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిలో సోమవారం 306 ఓపీ నమోదైంది. రక్త పరీక్షలు చేసి వైద్యులు సేవలందించారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నట్టు సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు.
– సీతంపేట