
హెచ్‌ఐవీ రోగుల పట్ల వివక్ష తగదు
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె. రాణి
విజయనగరం ఫోర్ట్: హెచ్‌ఐవీ రోగుల పట్ల వివక్ష తగదని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్‌ఐవీ ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది, వ్యాధి సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీధి నాటకం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటే హెచ్‌ఐవీ బారిన పడకుండా ఉండవచ్చాన్నారు. హెచ్‌ఐవీ సోకిన తర్వాత బాధపడేకంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, ఐసీటీసీ సూపర్ వైజర్ సాక్షి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.