నీరేదీ | - | Sakshi
Sakshi News home page

నీరేదీ

May 8 2025 9:13 AM | Updated on May 8 2025 9:13 AM

నీరేద

నీరేదీ

గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025
అల్లూరి పోరాటం చిరస్మరణీయం

తోటపల్ల్లి..

ఆయకట్టుకు

తోటపల్లి ప్రాజెక్టు.. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లా రైతులకు సాగునీటి ఆదరువు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి. సుమారు రెండు లక్షల ఎకరాల పైబడి ఆయకట్టు ఉంది. ఇంత ప్రాధాన్యమున్న ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. గత ప్రభుత్వం తలపెట్టిన కాలువల ఆధునికీకరణ పనుల కొనసాగింపునకు అవసరమైన నిధులు విదల్చకుండా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ సమయం దగ్గరపడుతున్నా కాలువలు, షట్టర్ల పనులు చేసేవారే లేరు. వచ్చే ఖరీఫ్‌కు 64ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు.

సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్‌: నాగావళి నదిపై నిర్మించిన తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 2.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. మిగులు పనులు, నిర్వహణ లేకపోవడం కారణంగా ఇంకా 64 వేల ఎకరాల వరకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా ఆయకట్టుకు నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 34 డిస్ట్రిబ్యూషన్‌ కాలువలకు 26 పూర్తయ్యాయి. మైనర్‌, సబ్‌మైనర్‌ కాలువల పనులు 73 శాతం అయ్యాయి. మిగులు పనులకు రూ.123 కోట్ల వరకు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం గత వార్షిక బడ్జెట్‌లో కేవలం రూ.47.80 కోట్లు కేయించింది. గజపతినగరం బ్రాంచి కెనాల్‌ 44 శాతం పనులే అయ్యాయి. ఆ కాలువ మిగులు పనులు పూర్తి చేయాలంటే కనీసం రూ.211 కోట్లు అవసరం. ఈ నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేస్తేనే శివారు ఆయకట్టుకు నీరందే పరిస్థితి ఉంటుంది.

ఆయకట్టుకు అందని సాగునీరు

పాలకొండ నియోజకవర్గంలో సాగుకు ప్రధాన నీటి వనరు తోటపల్లి రిజర్వాయర్‌. దీని పరిధిలో ఎడమ కాలువకు సంబంఽధించి 7, 8 బ్రాంచిల ద్వారా దాదాపు 10 వేలపై చిలుకు ఎకరాలకు సాగునీటి లభ్యత అందించాల్సి ఉందని రైతులు చెబుతున్నారు. ఈ కాలువల పనులు గత ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. ముఖ్యంగా వీరఘట్టం, పాలకొండ మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 8,500 ఎకరాల మేర సేద్యం చేపడుతున్న 15వేల మంది రైతులు వరుణుడి కరుణపైనే ఏటా ఆధారపడుతున్నారు. పాలకొండ మండలంలోని పాలకొండ, ఎన్‌కే రాజపురం, సింగన్నవలస, రుద్రుడుపేట, పరశురాంపురం, వెలగవాడ, లంబూరు, ఓని, వీపీ రాజుపేట, బాసూరు, అర్దలి, పద్మాపురం, వీరఘట్టం మండలంలోని నీలాపురం, తెట్టంగి, వండవ, అడారి, వీరఘట్టం, నడుకూరు.. జియ్యమ్మవలస మండలంలోని పెదబుడ్డిడి, చినబుడ్డిడి తదితర సుమారు 25 గ్రామాలకు సంబంధించి వేలాది ఎకరాల తోటపల్లి ఆయకట్టు భూములకు కొంతకాలంగా సాగునీరు అందడం లేదు. చీపురుపల్లి నియోజకవర్గంలోని ఆయకట్టుదీ ఇదే పరిస్థితి. కాలువల అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడంతో పనులు చేయలేకపోతున్నామని అధికారులు సమాధానం ఇస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు కాలువల పూర్తి, నిర్వహణ, నిర్వాసితుల పునరావాసం వంటివి పూర్తి కావాలంటే సుమారు రూ.590 కోట్లు కావాలని చెబుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన రూ.47 కోట్లు ఉద్యోగులు జీతాలకే సరిపోవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో సేవలందించే లష్కర్ల కొరత ఉంది. 15 మందికి ఇద్దరే సేవలందిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

ఖరీఫ్‌ సమయం దగ్గరపడుతున్నా ముందుకు సాగని కాలువల ఆధునికీకరణ పనులు

పూడుకుపోయిన కాలువలు

తవ్వకానికి మిగిలి ఉన్న పిల్లకాలువలు

రైతన్నకు తప్పని సాగునీటి తిప్పలు

నిధులు విదల్చని కూటమి ప్రభుత్వం

ఆవేదనలో రైతాంగం

నీరేదీ1
1/6

నీరేదీ

నీరేదీ2
2/6

నీరేదీ

నీరేదీ3
3/6

నీరేదీ

నీరేదీ4
4/6

నీరేదీ

నీరేదీ5
5/6

నీరేదీ

నీరేదీ6
6/6

నీరేదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement