
సంకిలి చక్కెర ఫ్యాక్టరీ మూతపడకుండా చూడాలి
బొబ్బిలి: సంకిలి చక్కెర ఫ్యాక్టరీని మూత వేసి బీర్ల కంపెనీ పెట్టే యోచనలో యాజమాన్యం ఉందని, ఆ దిశగా యాజమాన్యాన్ని వెళ్లనీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.గోపాలం అన్నారు. బొబ్బిలిలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న లచ్చయ్యపేట, భీమసింగి చక్కెర పరిశ్రమలు మూతపడటంతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. చెరకును పండించేందుకు అవస్థలు పడుతున్నారన్నారు. ఇప్పటికే సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు ఫ్యాక్టరీని మూత పడనీయకుండా చర్యలు తీసుకోకపోతే చెరకు రైతు కనుమరుగు కావడం ఖాయమన్నారు. జిల్లాలో విమానాశ్రయాలు, ఆయుధ బాండాగారాల వలన రైతులకు, ప్రజలకు వచ్చిన ప్రయోజనాలు లేవని, రైతు సంబంధ ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, రెడ్డి త్రినాధ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ రైతు సంఘం డిమాండ్