రషీద్ కుటుంబం
కన్నీరుమున్నీరైన
గురజాల/ రెంటచింతల: రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన బయో డీజిల్ అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన తెలిసిందే. మృతుడిని గురజాలకు చెందిన రషీద్‌గా గుర్తించారు. రషీద్ గత ఆరు సంవత్సరాలుగా బయోడీజిల్ ప్లాంటులో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర కిందటే వివాహం కాగా, ఆయిదు నెలల కుమారుడు ఉన్నాడు. రషీద్ తండ్రి ఆరేళ్ల కిందట చనిపోవడంతో తల్లి ఖాశీంబీ, భార్య అమిజాబేగం, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రషీద్ అకాల మరణంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. తహున్‌షాకు గుండెలో రంధ్రం ఉండటంతో రెండు నెలల క్రితమే ఆపరేషన్ చేయించారు. వారం రోజులుగా ప్లాంట్‌లో డీజిల్ లేదని, శనివారం రాత్రి ట్యాంక్ వస్తుందని విధులకు వెళ్లి ఆదివారం ఉదయానికే రషీద్ చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పారిశ్రామికంగా పల్నాడు ప్రాంతం ప్రసిద్ధి చెందింది. సిమెంటు, కెమికల్, సున్నం వంటి పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయిు. వేల మంది కార్మికులు వాటిల్లో పనిచేస్తుంటారు. ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక కేంద్రాలు పల్నాడు ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. 50 కిలోమీటర్లు దూరం వరకు ఒక్క అగ్నిమాపక శాఖ కార్యాలయం లేకపోవడం గమనార్హం.
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువజాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం చుట్టూ అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు.
రషీద్ కుటుంబం


