
అక్రమ డ్రగ్స్ రవాణ నిందితులు అరెస్ట్
చిలకలూరిపేటటౌన్: బెంగళూరు నుంచి గుంటూరుకు అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న నిందితులు గుంటూరు బ్రాడీపేటకు చెందిన చల్లా గోపి, సంగడిగుంటకు చెందిన షేక్ ఫారుక్ సహా ఐదుగురిని చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు నేతృత్వంలోని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ.50 వేల విలువైన 25 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ నిందితులు బెంగళూరులోని డ్రగ్ సరఫరాదారుల నుంచి మాదకద్రవ్యాలను తీసుకువచ్చి, గుంటూరులో యువత మధ్య అక్రమ వ్యాపారం చేయడానికి ప్రయ త్నించారని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరిని కోర్టుకు హాజరు పరిచినట్లు వెల్లడించారు.