
డ్రైవర్లకు సీపీఆర్ శిక్షణ అవసరం
నరసరావుపేట: ట్రక్కు డ్రైవింగ్ నేర్చుకునే వారికి సీపీఆర్ ట్రైనింగ్ అవసరమని పల్నాడు జిల్లా రహదారి భద్రత కమిటీ మెంబర్ సెక్రటరీ, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్.రాజానాయక్ అన్నారు. గురువారం రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను గురువారం సందర్శించి ట్రైనింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రీసెర్చ్ సెంటర్‌ను ఎంఎస్‌ఎంఈ యూనిట్ ద్వారా ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ట్రక్కు డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఆర్టీఓ ఆఫీసు పక్కనే ఉండటం వల్ల వాహనదారులకు లైసెన్సు మంజూరు సమయంలో నిర్వహించే పరీక్ష ఇక్కడ నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన రిఫ్రెషర్ ట్రైనింగ్‌లో భాగంగా సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడానికి ఈ విభాగాన్ని ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. రీసెర్చ్ సెంటర్ మేనేజింగ్ పార్టనర్ కనకదుర్గ పద్మజ, ఎన్జీఓ సభ్యుడు బంగారయ్య పాల్గొన్నారు.