
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడమటి బిక్షాలు కోరారు. టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు, పార్క్ కూలీలకు, ఆఫీసు సిబ్బందికి, టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి కేటగిరిల వారీగా జీఓ 36 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. అవుట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని విన్నవించారు. రిటైర్ అయిన కార్మికులస్థానంలో, మృతి చెందిన వారి స్థా నాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశా లు కల్పించాలని కోరారు. సమస్యను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ద్వారా ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని శివప్రసాద్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సింగం వాణిశ్రీ పాల్గొన్నారు.