
జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ నల్లపాటి చంద్రశేఖరరావు మ
నరసరావుపేట: గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు (84) మృతిచెందారు. గత 20రోజులుగా ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం జొన్నలగడ్డకు తీసుకొచ్చారు. ఆయన భార్య రెండేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో నల్లపాటి రామచంద్రప్రసాదు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి, ప్రస్తుత జీడీసీసీ బ్యాంకు అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు చంద్రశేఖరరావు మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చంద్రశేఖరరావు మృతికి మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
21న అధ్యాపక పోస్టులకు
ఇంటర్వ్యూలు
విజయపురిసౌత్: స్థానిక ఏపీఆర్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నయీంభాను శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతం–1, హిస్టరీ–1, కామర్స్–2, కంప్యూటర్ సైన్స్–2, కెమిస్ట్రీ–1, జువాలజీ–1, అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సంబంధిత పోస్టు కోసం పోస్ట్ గ్రాడ్యూయేషన్‌లో 55 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని, పీహెచ్‌డీ, యుజీసీ నెట్, సెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయగలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 11వ తేదీ ఉదయం 11గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. మరిన్నీ వివరాల కోసం 8688169290 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.