
రాజకీయ కుట్రలో భాగంగానే శిలాఫలకం ధ్వంసం
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏర్పాటు చేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు మాదాల కిరణ్‌కుమార్, చింతా సుబ్బారెడ్డిలు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పట్టణంలోని జానపాడు రోడ్డులో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.52 కోట్ల నిధులు మంజూరు చేయించి, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారన్నారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేయటం సరైన పద్ధతి కాదన్నారు. ఒక వేళ నిర్మాణానికి అడ్డు వస్తే తొలగించి, ఆ పరిసర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేయాలేగానీ, ధ్వంసం చేయటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి చింతా రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు కొక్కెర శ్రీను, షేక్ సైదావలి, కత్తెరపు వాసుదేవరెడ్డి, నాయకులు కందులూరి శివయ్య, చల్లా పిచ్చిరెడ్డి, శివారెడ్డి, అల్లు పిచ్చిరెడ్డి, శెట్టుపల్లి పూర్ణ, కాలే మాణిక్యరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాధ్యులపై సత్వరం చర్యలు తీసుకోవాలి
పిడుగురాళ్ల పీఎస్‌లో వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు