
అన్నపూర్ణాదేవికి ఆషాఢం సారె
పెదకూరపాడు: మండలంలోని 75త్యాళ్లూరులో వేంచేసియున్న శ్రీకాశీ అన్నపూర్ణదేవికి శుక్రవారం మహిళలు ఆషాఢం సారె సమర్పణ ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీవిఘ్నేశ్వర స్వామీ ఆలయం నుంచి మేళతాళాలతో గ్రామ దేవుని వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని 108 రకాల వంటకాలు, వస్త్రాలు, పసుపు కుంకుమ గాజులు, పూలు, పండ్లు, తాంబూలాలు, వాయనాలను అన్నపూర్ణాదేవికి సమర్పించారు. ఆలయ అర్చకులు నుదురుపాటి హనుమంతరావుశర్మ, హరినాథ్ శర్మ, తారకనాథ్ శర్మ పూజ క్రతువు నిర్వహించారు. శ్రీ శివసాయి ట్రస్టు సభ్యులు పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారికి సారె సమర్పణ నిర్వహించడం జరుగుతుందని మహిళలు తెలిపారు.

అన్నపూర్ణాదేవికి ఆషాఢం సారె