
తక్కువ ధరకే కూరగాయలు
రైతు బజార్ల ఏర్పాటు వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన తాజా కూరగాయలు, ఆకుకూరలు లభిస్తాయి. రైతులతోపాటు మాలాంటి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం రాయితీపై ఉల్లి, టమోటా, నూనెలు, పప్పులు లాంటివి విక్రయించేందుకు రైతు బజార్లు ఎంతో ఉపయోగపడతాయి. పిడుగురాళ్లలో రైతు బజారు ఏర్పాటు ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం అధిక ధరలకు కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది.
– ఎం.జ్యోతి, జానపాడు,
పిడుగురాళ్ల మండలం