నరసరావుపేట: పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కమిటీ ఏర్పాటైంది. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓ ఏకా మురళి అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో చైర్మన్‌గా మేదరమెట్ల రామశేషగిరిరావు, వైస్ చైర్మన్‌గా కేఎంఎన్‌వీ శ్రీనివాసగుప్తా, కోశాధికారిగా డాక్టర్ నంద్యాల రాంప్రసాదరెడ్డిలను నియమించారు. అలాగే మేనేజింగ్ కమిటీ సభ్యులుగా పూర్వ అధ్యక్షులు డాక్టర్ కంజుల జగన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ ఎస్.రాంప్రసాద్, డాక్టర్ సృజన, బత్తుల మురళి, బీవీఎల్ ప్రసాద్, పి.నరసింహారావు, విన్సెంట్‌పాల్, భుజంగరావు నియమితులయ్యారు. పరిశీలకులుగా ఏపీ స్టేట్ కోశాధికారి రామచంద్రరాజు వ్యవహరించారు. నూతనంగా ఎన్నికై న సభ్యుల చేత డీఆర్‌ఓ ప్రతిజ్ఞ చేయించారు. గత మూడేళ్లు జరిగిన సేవా కార్యక్రమాలు, ఫైనాన్షియల్ నివేదికను సమర్పించారు. అలాగే గత మూడేళ్లుగా సేవలు అందజేసిన డాక్టర్ కంజుల జగన్‌మోహన్‌రెడ్డి, కమిటీ సభ్యులను సన్మానించారు.