బాబు మోసాలపై యువత పోరు | - | Sakshi
Sakshi News home page

బాబు మోసాలపై యువత పోరు

Jun 23 2025 5:46 AM | Updated on Jun 23 2025 5:46 AM

బాబు

బాబు మోసాలపై యువత పోరు

పల్నాడు
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్‌ శ్రీ 2025

7

ఆషాడ ఉత్సవాలు

దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళి ఆలయంలో ఆషాడం సందర్భంగా జూన్‌ 29న నిమ్మకాయల దండలతో, జూలై 6న గాజులతో అలంకారం చేయనున్నారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటి మట్టం ఆదివారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం.

వాహన తనిఖీలు

నకరికల్లు: స్థానిక వై జంక్షన్‌ వద్ద కారంపూడి రోడ్డులో ఎస్‌ఐ చల్లా సురేష్‌ ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు. పత్రాలు లేని 12 మందిపై కేసులు నమోదు చేశారు.

సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగం ఇస్తారని పల్నాడు జిల్లాలోని 527 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల పరిధిలోని సుమారు 6.51 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ పిల్లలు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలను మాన్పించి తల్లిదండ్రులు కోచింగ్‌ సెంటర్లకు పంపారు. ఉద్యోగ నియామకాల పరీక్షలకు దాదాపు ఇంటికి ఒకరు చొప్పున సిద్ధమవుతున్నారు. నరసరావుపేటతోపాటు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌లకు వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. చేస్తున్న ఉద్యోగాలు మానేయడంతో ఇంటి నుంచి డబ్బులు అడగాల్సి వస్తోందని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో పెట్టిన సూపర్‌ సిక్స్‌లో మొదటి హామీ అయిన 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకపోతే నెల నెలా రూ.3 వేలు భృతి ఏడాదిగా అమలుకు నోచుకోలేదు. దాని ప్రకారం వెంటనే ఎటువంటి షరతులు లేకుండా ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పథకం ప్రకారం సగటున ఇంటికో నిరుద్యోగి అనుకున్నా జిల్లాలో 6.51 లక్షల మందికి నెలకు రూ.195.48 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపఽథ్యంలో సుమారు రూ.2,345.76 కోట్లు వారికి ఇప్పటికే బకాయిపడింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ?

‘జాబ్‌ రావాలంటే బాబు రావాలి.. జాబ్‌ వచ్చే వరకు నిరుద్యోగ భృతి’ అంటూ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ ఐదేళ్లు ఏం చేశారన్నది అందరికీ తెలిసిందే. 2014–19 మధ్య యువతను మోసం చేసిన చంద్రబాబును నమ్మి మరోసారి మోసం పోయామని యువత ఆందోళన చెందుతోంది. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం తెలుగు తమ్ముళ్లకు మాత్రమే మద్యం, ఇసుక, మైనింగ్‌ వంటి వాటిలో అక్రమ సంపాదనకు అవకాశం లభిస్తోందని యువత వాపోతున్నారు. మరోవైపు విద్యార్థులకు మంజూరు చేయాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులపై విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్రంలో విద్యా, వసతి దీవెనల రూపంలో సుమారు రూ.6 వేల కోట్ల బకాయిలు పడ్డట్టు సమాచారం. ఈ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయడం లేదు.

న్యూస్‌రీల్‌

జిల్లాలో నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య

శాశ్వత ఉద్యోగాలు కల్పించిన వైఎస్‌ జగన్‌

2019లో అఽధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి... వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల పేరిట శాశ్వత ఉద్యోగాలను కల్పించి పల్నాడు జిల్లాలో 4,703 మంది యువతకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. అలాగే 10,276 మందికి గ్రామ, వార్డు వలంటీర్‌ పేరిట ఉపాధి కల్పించి వారితో ప్రజలకు సేవ చేయించారు. మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌లో మరో మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేశారు. అలాగే ఇతర శాఖల్లో శాశ్వత, కాంట్రాక్టు పోస్టులు భర్తీ చేశారు. అప్కాస్‌ పేరిట వేలాది మందికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు కల్పించారు. యువత ఉద్యోగాలు పొందేందుకు ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ అందజేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాదిరి కూటమి సర్కారు కూడా శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగాలను కల్పించాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు.

ఏడాదిగా ఆశగా

ఎదురుచూస్తున్న జిల్లా యువత

చేస్తున్న పనులు మానేసి

కోచింగ్‌ సెంటర్లలో చేరిక

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

చేయకపోవడంతో ఆందోళన

ఉద్యోగం వచ్చేవరకూ నెలకు

రూ.3 వేల భృతి పేరిట మోసం

సుమారు 6.51 లక్షల

మందికి అందని సాయం

మరోసారి నిరుద్యోగులను

నిండా ముంచిన చంద్రబాబు

వైఎస్‌ జగన్‌ హయాంలో భారీగా

శాశ్వత ఉద్యోగాల కల్పన

ప్రభుత్వం తీరుపై నేడు వైఎస్సార్‌సీపీ

యువజన విభాగం నిరసన

యువతకు కచ్చితంగా ఉద్యోగం ఇస్తాం.. లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇవేమీ అమలు కాలేదు. మళ్లీ యువతను చంద్రబాబు నిండా ముంచేశారు. తొలి సంతకం చేసిన మెగా డీఎీస్సీలో మెగా లేకుండాపోయింది. అరకొర పోస్టులతో ఆర్భాటంగా నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాటిపైనా తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు గ్రూప్‌–1, 2, 4 తదితర ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ కూడా ప్రకటించలేదు. అన్యాయానికి గురైన యువతకు అండగా వైఎస్సార్‌సీపీ పోరుబాటు పట్టింది. అందులో భాగంగా సోమవారం వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘యువత పోరు’కు పిలుపునిచ్చింది. నరసరావుపేట లింగంగుంట్లలోని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేయనున్నారు.

బాబు మోసాలపై యువత పోరు 
1
1/5

బాబు మోసాలపై యువత పోరు

బాబు మోసాలపై యువత పోరు 
2
2/5

బాబు మోసాలపై యువత పోరు

బాబు మోసాలపై యువత పోరు 
3
3/5

బాబు మోసాలపై యువత పోరు

బాబు మోసాలపై యువత పోరు 
4
4/5

బాబు మోసాలపై యువత పోరు

బాబు మోసాలపై యువత పోరు 
5
5/5

బాబు మోసాలపై యువత పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement