
వేధింపులకు గురైన బాలిక ఆస్పత్రికి తరలింపు
చిలకలూరిపేటటౌన్: బాలికపై కన్నతల్లే కర్కశంగా వేధించిన కేసులో బాలల హక్కుల పరిరక్షణ అధికారులు స్పందించారు. పట్టణంలోని ఈనెల 31వ తేదీన ఏడాది కిందట భర్తతో విడిపోయి ప్రియుడితో సహజీవనం చేస్తున్న దీప్తి తన కుమార్తెను వేధింపులకు గురిచేసిన విషయం విధితమే. బాధిత బాలికను పరామర్శించి ఐసీడీఎస్ సీడీపీఓ, మహిళ పోలీస్, డీసీపీఓ వివరాలను సేకరించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్‌వైజర్, మహిళ పోలీస్ ఆధ్వర్యంలో బాలికను గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అనంతరం నరసరావుపేట బాలల సదన్‌లో చేర్పించనున్నట్లు వారు వెల్లడించారు.
పంపిణీ చేసే ఇళ్ల స్థలాల పరిశీలన
మంగళగిరి: నగర పరిధిలోని యర్రబాలెం డాన్‌బాస్కో స్కూలు వద్ద శుక్రవారం పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్థల పట్టాల పంపిణీని ప్రారంభించనున్న నేపధ్యంలో ఎస్పీ పరిశీలన జరిపారు. అధికారులకు భద్రతా సూచనలు చేశారు. ట్రాఫిక్, , వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ వై. శ్రీనివాసరావు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ
వేమూరు: మండలంలోని చంపాడు ఇరిగేషన్ కాలువ వంతెన వద్ద ఇసుక ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. వివరాలు మేరకు... కొల్లూరు మండలంలోని గాజులంక నుంచి తెనాలికి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసు స్టేషన్‌లో ముడుపులు చెల్లించడంతో రాత్రి వేళ తిరిగే లారీలు, ట్రాక్టర్ల యజమానులపై పోలీసులు కేసు నమోదు లేదు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గాజులంక గ్రామం నుంచి ఇసుక లోడుతో ట్రాక్టర్, లారీ బయలుదేరాయి. చుంపాడు ఇరిగేషన్ కాలువ వంతెన వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొని పడిపోయింది. వంతెన వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అక్రమ ఇసుక విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ నాయకులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని ఇసుక లారీని తొలగించారు. సీఐ మాట్లాడుతూ దీనిపై స్టేషన్‌లో ఫిర్యాదు అందలేదన్నారు.

వేధింపులకు గురైన బాలిక ఆస్పత్రికి తరలింపు

వేధింపులకు గురైన బాలిక ఆస్పత్రికి తరలింపు