గుణుపూర్‌లో అగ్నిప్రమాదం
● రెండు గంటలు శ్రమించి మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ బకేటి వీధిలోని ఓ ఇంటి పై అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు చూసి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఇంటి మూడో అంతస్తులో భారీ ఎత్తున బాణసంచా ఉండడంతో ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. బాణసంచా పేలుడు కారణంగా గోడలు బీటలు వారాయి. జనావాసాల మధ్య అక్రమంగా బాణసంచా ఉంచడంతో దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు.
గుణుపూర్‌లో అగ్నిప్రమాదం


