చేనేత బ్రాండ్ అంబాసిడర్‌కు రూ.కోటిన్నర
భువనేశ్వర్: రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా 2025 సంవత్సరానికి గాను బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌కు రూ.కోటి 60 లక్షలు చెల్లించినట్లు రాష్ట్ర జౌళి, చేనేత శాఖ మంత్రి ప్రదీప్ బాల్ సామంత బుధవారం శాసన సభలో తెలియజేశారు. విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ కుమార్ సాహు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వెల్లడించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ఖజానా నుంచే చెల్లిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ రుసుముతో పాటు ఆమె నియామకానికి సంబంధించిన సందర్శనలకు విమాన ఛార్జీలు, వసతి, ఆతిథ్య ఖర్చులను ప్రభుత్వం అదనంగా చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. ఒడిశా సాంప్రదాయ చేనేత రంగం ప్రపంచ ఆకర్షణను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను ఒడిశా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు తెలిపారు.


