ఉత్సాహం ఉత్సవమై..
● చొయితీ ఉత్సవాలకు శ్రీకారం
● కాసీపూర్ నుంచి సమితి నుంచి
ప్రారంభం
రాయగడ: చొయితీ ఉత్సవాలకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని కాసీపూర్‌లో ఉన్న మా మణికేశ్వరి మందిరం నుంచి సమితి స్థాయి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అమ్మవాకి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారి ఆశీర్వచచాలు పొందిన అనంతరం అక్కడ నుంచి కలశ యాత్రకు నాంది పలికారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి కలశాన్ని మోసుకుంటూ మందిరం నుంచి తోడ్కొని రాగా, కలెక్టర్ కులకర్ణి జ్యొతీ ప్రజ్వలన చేసిన మషాల్‌ను పట్టుకుని ర్యాలీలొ పాల్గొన్నారు. అంతకుముందు కాసీపూర్‌లో మటోపొద వద్ద ఉన్న నది సమీపంలో గంగామాతకు ప్రత్యేక పూజలను సరస్వతి మాఝి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, సమితి అధ్యక్షుడు కొంఠో మాఝిలు నిర్వహించారు. కలశాలతో శుద్ధ జలాలను తీసుకువచ్చి మణికేశ్వరి మందిరంలో నిలిపారు. అలాగే జిల్లాలోని పదకొండు సమితులకు చెందిన 11 కలశలను పూజా కార్యక్రమంలో ఉంచారు. అనంతరం భక్తుల సమక్షంలో కలశ యాత్రను ప్రారంభించారు.
భారీ ఎత్తున ర్యాలీ
సమితి స్థాయి చొయితీ ఉత్సవాల ప్రారంభోత్సవంలో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీ, యువకులు పాల్గొన్నారు. కలశ యాత్రలో పాల్గొన్న వీరంతా నృత్యాలతో సందడి చేశారు. చొయితీ శుభాకాంక్షలు ఒకరినొకరు చెప్పుకున్నారు.
ప్రచార రథం ప్రారంభం
చొయితీ సమితి స్థాయి ఉత్సవాల్లో భాగంగా స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ప్రత్యేకంగా రూపొందించిన చొయితీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, జిల్లా సాంస్కృతి విభాగం అధికారి సస్మిత బౌరి, డొంబురు పండ, పాత్రికేయులు పాల్గొన్నారు. జిల్లాలో నేటి నుంచి ప్రచార రథం ప్రతీ సమితిలో పర్యటిస్తూ చొయితీ ఉత్సవాలకు సంబంధించి ప్రచారం చేస్తుందని సాంస్కృతిక శాఖ అధికారి బౌరి వెల్లడించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కాసీపూర్‌లో మంగళవారం సమితి స్థాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కలహండి జిల్లాకు చెందిన భవాణీపట్నం నుంచి వచ్చిన గుంరా నృత్యప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ఒడిశా సంస్కృతికి అద్దం పట్టే సంబల్‌పూర్ నృత్యాలు, ఆదివాసీ భాషా, సంస్కృతిని ప్రతిబింబించే థింశా నృత్యం అందరినీ అలరించింది. ఆదివాసీల సంప్రదాయ వాయిద్యం ఢమరుకం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఉత్సాహం ఉత్సవమై..
ఉత్సాహం ఉత్సవమై..
ఉత్సాహం ఉత్సవమై..
ఉత్సాహం ఉత్సవమై..
ఉత్సాహం ఉత్సవమై..
ఉత్సాహం ఉత్సవమై..


