వికసిత భారత్‌లో యువతే కీలకం | - | Sakshi
Sakshi News home page

వికసిత భారత్‌లో యువతే కీలకం

Dec 3 2025 7:51 AM | Updated on Dec 3 2025 7:51 AM

వికసిత భారత్‌లో  యువతే కీలకం

వికసిత భారత్‌లో యువతే కీలకం

భువనేశ్వర్‌: వికసిత భారత్‌ కేంద్ర ప్రభుత్వం లక్ష్యం దిశలో యువజనం పాత్ర అత్యంత కీలకమని, యువతరం చైతన్యంతో ముందడుగు వేసి అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాతలు కావాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. జట్నీ కళాశాల మండల స్థాయి మండల స్థాయి యు వజనోత్సవం 2025 నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జెట్నీ మండల విద్యాధికారి యోగేష్‌ చంద్ర సామంతసింగార్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జట్ని మండల అభివృద్ధి అధికారి (బీడీఓ) బసంత్‌ కుమార్‌ హాతి మాట్లాడుతు దేశాభివృద్ధి బాటలో యువ విద్యార్థుల ప్రతిభ ప్రధానాంశమై నిలుస్తుందన్నారు. యువ ప్రతిభాపాటవాలు దేశానికి అంకితం కావాలని యువ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఒడిశా ఇంజనీరింగ్‌ కళాశాల విరామ ప్రొఫెసర్‌ ఇంజనీర్‌ రాజేంద్ర ప్రసాద్‌ నాయక్‌ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక స్థైర్యంతో ఏకాగ్రత బలపరచుకుని సానుకూల మనస్తత్వంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. కళాశాల అధ్యక్షురాలు డాక్టర్‌ స్వప్న మల్లిక్‌ యువజనోత్సవం లక్ష్యాన్ని వివరించారు. జట్నీ మండల పరిధిలో కళాశాలల నుంచి 100 మంది విద్యార్థులు మో భారత్‌ (నా భారతదేశం) పోర్టల్‌ ఆధ్వర్యంలో యువజనోత్సవం 7 విభాగాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారని సమన్వయక్తర పూర్ణ చంద్ర బెహరా తెలిపారు. మండల స్థాయి ఉత్సవాల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికై నట్లు ప్రకటించారు.

‘ఐదేళ్లలో 25 మెగా పైపుల నీటి ప్రాజెక్టులు పూర్తి’

భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో 25 భారీ కుళాయి నీరు సరఫరా (పీడబ్ల్యూఎస్‌) ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన రూ.35,193.24 కోట్లలో రూ.17,502.12 కోట్లు ఖర్చు చేసిందని పంచాయతీ రాజ్‌, తాగు నీటి శాఖ మంత్రి రబీ నారాయణ్‌ నాయక్‌ రాష్ట్ర శాసన సభలో తెలిపారు. ఎమ్మెల్యే అరవింద్‌ మహా పాత్రో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానంగా గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగు నీటిని అందించేందుకు 207 భారీ పీడబ్ల్యూఎస్‌ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. పురోగతి ఆశాజనకంగా ఉన్నప్పటికి భూసేకరణలో జాప్యం, నిర్వాహక సంస్థల నిర్లక్ష్యం మరియు చట్టబద్ధమైన ఆమోదాలలో జాప్యం వంటి సమస్యల కారణంగా అనేక ప్రా జెక్టులు మందకొడిగా కొనసాగుతున్నాయని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం విఫలమైన సంస్థలకు భారీ జరిమానాలు విధించింది. వివరణ కోరుతు తాఖీదులు జారీ చేసింది. పురోగతిని పర్యవేక్షించి అడ్డంకులను తొలగించేందుకు ఉన్నత స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు తరచు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సంవత్సర వారీ వివరాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 14 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇది అన్ని గ్రామీణ కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అనే ప్ర భుత్వ లక్ష్యాన్ని సాధించే దిశగా గణనీయమైన పురోగతిని సూచిస్తుందని అన్నారు.

దోపిడీ దొంగల అరెస్టు

జయపురం: బైకిస్టుపై దాడి చేసి మొబైల్‌ దోపిడీ చేసిన నలుగురు దొంగలను అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ పోలీసు అఽధికారి రచిత మడకామి మంగళవారం వెల్లడించారు. వారి నుంచి రెండు బైక్‌లు, రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వివరాల్లోకి వెళితే..నవంబర్‌ 28వ తేదీన బొరిగుమ్మ సమితి బిరిగుడ గ్రామానికి చెందిన రాధాకాంత పాత్రో 26వ జాతీయ రహదారిలో బైక్‌ ఇంటికి వెళ్తున్న సమయంలో అంచల– ఖెందుగుడ గ్రామాల మధ్య ముఖానికి మాస్కులు వేసుకున్న దుండగులు అతన్ని అడ్డగించి మొబైల్‌ లాక్కోవడంతోపాటు దాడి చేసి కొట్టారు. ఈ సంఘటనపై రాధాకాంత పాత్రో బొరిగుమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. దోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పేర్కొ న్నారు. అరెస్టయిన వారు నవరంగపూర్‌ జిల్లా పపడహండి పోలీసుస్టేషన్‌ పరిధిలోని సనకుమిలి గ్రామానికి చెందిన రోషన్‌ హరిజన్‌, చొబి హరిజన్‌, సునీల్‌ హరిజన్‌, జయపురం సదర్‌ పోలీసు పరిది డుమురుగుడ గ్రామానికి చెందిన మధుసూదన హరిజన్‌ ఉన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement