నేడు శ్రీ ముఖ అలంకరణ
భువనేశ్వర్: బుధవారం మార్గశిర మాసం శుక్ల పక్ష త్రయోదశి పురస్కరించుకుని శ్రీ మందిరం రత్న వేదికపై మూల విరాట్లకు ముఖ అలంకరణ దిద్దుతారు. ద్వితీయ భోగ మండప సేవ ముగిసిన తర్వాత ఈ సన్నాహాలు ఆరంభిస్తారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తారని శ్రీ మందిరం అధికార వర్గాలు తెలిపాయి.
ఆదివాసీల
భారీ ఢమరుక వాయిద్యం
సంస్కృతికి అద్దం పట్టే
ఉత్సవాలు: కలెక్టర్
ఆదివాసీ, హరిజన సంప్రదాయాలతో ఇమిడి ఉన్న రాయగడ జిల్లా వారి భాషా, సంస్కృతి, కళలను పరిరక్షించడంతో పాటు వారి సంస్కృతికి అద్దం పట్టేవిధంగా ఏటా చొయితీ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. సమితి స్థాయి ఉత్సవాల ప్రారంభోత్సవలో భాగంగా కాసీపూర్‌లోని సమితి కార్యాలయం వెనుక ఉన్న మైదానంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం అందరి కర్తవ్యమన్నారు. ఈ నెల 26 నుంచి ఐదు రోజులు జిల్లా కేంద్రమైన రాయగడలో ఉన్న గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జరగనున్న జిల్లా స్థాయి చొయితీ ఉత్సవాలకు అంతా సహకరించడంతో పాటు ఉత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చొయితీ ఉత్సవాలకు సంబంధించిన పొస్టర్లను వేదికపై ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, రాయగడ ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న పాల్గొన్నారు.


