● వైభవంగా ద్వాదశ పూజలు
జయపురం: జయపురం సమితి అంబాగుడ గ్రామంలోని శ్రీరాధాకృష్ణ మందిరంలో ద్వాదశి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భగవాన్ రాధాకృష్ణకు 72 రకాలతో తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా భక్తులు సమర్పించారు. సంకీర్తనలు, భజనలు, సత్సంగ్ పూజలు చేశారు. బాబా కృష్ణచంద్రపాల్, పూరీ హరిచరణ దాస్, రత్నాకర నారాజీ, లింగరాజ్ నిశంకో, బిపద భంజీన మండల్ నీర సాహు, మదన మహారాజ్, పాఢీ తుషార కాంత దాస్‌లు ద్వాదశ మహోత్సవ ప్రాధాన్యాన్ని భక్తులకు వివరించారు. రొశాయి బిశ్వనాద్ పాఢీ పర్యవేక్షణలోలో జరిగిన పూజల్లో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
● వైభవంగా ద్వాదశ పూజలు
● వైభవంగా ద్వాదశ పూజలు


