ఘనంగా బీఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం
కొరాపుట్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 61వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎఫ్ సెక్టార్‌లో డీఐజీ సత్యవాన్ కంచి బీఎస్‌ఎఫ్ జెండా ఎగుర వేశారు.అనంతరం జవానులద్దేశించి ప్రసంగించారు. 1965 డిసెంబర్ ఒకటో తేదీన ఆవిర్భవించిన బీఎస్‌ఎఫ్ దేశ సమగ్రత, శాంతి పరిరక్షణలో ఎంతో కీలక పాత్ర వహించిందన్నారు. కొరాపుట్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం అదుపు చేయడంలో కృషి చేస్తుందని గుర్తు చేశారు. అనంతరం అమర జవాన్ల స్ఫూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ సత్యవాన్ మహాజన్, ఎస్పీ రోహిత్ వర్మ పాల్గొన్నారు.
ఘనంగా బీఎస్‌ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం


