ఆశ్రమ పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు అదృశ్యం
కొరాపుట్: గిరిజన సంక్షేమ అశ్రమ పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు అదృశ్యమైన ఘటన రాష్ట్రంలో అలజడి రేపింది. సోమవారం ఉదయం కొరాపుట్ జిల్లా లంకాపుట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అదృశ్యమైనట్టు ఉపాధ్యాయులు గుర్తించారు. వీరంతా ఒక టి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న చిన్నారులే. దీంతో జిల్లా నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికా రులు ఉలిక్కి పడ్డారు. వీరంతా ముందు రోజు రాత్రి ఆశ్రమాన్ని వదలి వెళ్లినట్లు సహచర విద్యార్థులు పేర్కొన్నారు. వెంటనే అధికారులు సమీప గ్రామాలు, అటవీ ప్రాంతాలు, కొండల్లో గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రం నుంచి ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున ఆశ్రమ పాఠశలకు చేరుకున్నా రు. పిల్లల తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. అయితే పిల్లలంతా అశ్రమ పాఠశాలకు తొమ్మిది కిలో మీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం కొండ మీద ఉన్నట్లు గిరిజనులు గుర్తించారు. వెంటనే అఽధికారులు పిల్లలను సురక్షితంగా అశ్రమ పాఠశాలకి తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిక నిబంధనల ప్రకారం రాత్రిపూట వార్డెన్‌గా ఉండాల్సిన ఉపాధ్యాయులు కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సొంత నివాసానికి వెళ్లి పోతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. అసలు వీరంతా ఎందుకు మూకుమ్మడిగా అడవి లోనికి వెళ్లిపోయారో తెలుసు కోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఆశ్రమ పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు అదృశ్యం


