నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గృహానికి సీఎం రాక
కొరాపుట్: అధికార బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ప్రభుత్వ అధికార గృహ నివాసం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్ చరణ్ మజ్జి హాజరై అందరినీ ఆశ్చర్య పరిచారు.సోమవారం భుబనేశ్వర్‌లోని యూనిట్–8లో గౌరీకి ప్రభుత్వం క్వార్టర్ కేటాయించింది. ఎమ్మెల్యే ఎన్నికై రెండేళ్లు గడుస్తున్నప్పటికీ మంచి క్వార్టర్ ప్రభుత్వం కేటాయించలేదు. మాజీలు ఖాళీ చేయకపోవడంతో ఎమ్మెల్యే ఇబ్బందులు పడ్డారు. చివరకు పాత భవనాన్ని మరమ్మతులు చేసి ఎమ్మెల్యేకి కేటాయించినప్పటికీ రెండేళ్లు గడచిపోయాయి. దీంతో ఎమ్మెల్యే గౌరీ కుటుంబ సభ్యులు పూజలు చేసి గృహ ప్రవేశం చేశారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యే రెండేళ్ల అనంతరం నూతన గృహ ప్రవేశం చేస్తుండడంతో సీఎం హాజరై గౌరీ మజ్జి కుటుంబం ఆశ్చర్యం కలిగించారు. సీఎం వెంట మరో ఐదుగురు మంత్రులు, 13 మంది ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు.
నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గృహానికి సీఎం రాక


