14న జయపురం రహగిరి వేడుకలు
జయపురం: ఈ నెల 14వ తేదీన జయపురం రహగి రి వేడుకలు నిర్వహించేందుకు రహగిరి నిర్వహణ కమిటీ నిర్ణయించింది. స్థానిక మున్సిపాలిటీ సభాగృహంలో జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి రహగిరి జరపాలని ప్రతిపాదించారు. సభికులు ఏకగ్రీవంగా అంగీకరించారు. 14వ తేదీ ఉదయం నుంచి 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రహగిరి వేడుకలు నిర్వహించాలని సబ్‌కలెక్టర్ నిర్దేసించా రు. ఆ కార్యక్రమంలో వివిధ మనోరంజన్ కార్యక్రమాలు, సంస్కృతిక ప్రదర్శనలతో పాటు పలు స్టా ల్స్ ఏర్పాటు చేసి ఆహార దినుసులు అమ్మకం ఏ ర్పాటు చేయాలని నిర్ణయించారు. 2017లో జయపురంలో రహగిరి వేడుకలు ప్రారంభించటం జరి గిందని సమావేశంలో వెల్లడించారు. వైస్ చైర్మన్ బి. సునీత, తహసీల్దార్ సబ్యసాచి జెనా, పట్టణ పోలీ సు అధికారి ఉల్లాస రంజన్ రౌత్, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రదాన్, జయపురం సబ్ డివిజన్ ప్రజాసంబంధాల, సమాచార అధికారి యశోద గదబ, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


