అవగాహనతోనే ఎయిడ్స్ దూరం
పర్లాకిమిడి: ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ముఖ్యవైద్యాధికారి కార్యాల యం నుంచి అవగాహన ర్యాలీని జిల్లా ముఖ్యవైద్యాధికారి, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ ముబారక్ అలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ విద్యార్థులు, ట్రాన్స్ జెండర్స్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ఎయిడ్స్ రోగులను సమాజంలో కొంతమంది దూరంగా ఉంచడా న్ని డాక్టర్ రాకేష్ కుమార్ బెహరా తప్పుబట్టారు. ఎయిడ్స్ మహమ్మారి నివారణకు ఆదిలోనే జాగ్రత్త లు తీసుకోవాలని సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ ప్రిన్సిపాల్ ఎస్.సునీత అన్నారు. వర్సిటీ నర్సింగ్ విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు. సెంచూరి యన్ వర్సిటీ, మహిళా డిగ్రీ కళాశాలల విద్యార్థులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
అవగాహనతోనే ఎయిడ్స్ దూరం


