అశ్లీల రీల్స్‌పై వీహెచ్‌పీ ఆగ్రహం
రాయగడ: స్థానిక చెక్కాగుడ వద్ద గల ప్రేమ్ పహాడ్ కొండపై కొలువైయున్న శివుని విగ్రహం వద్ద అశ్లీల వీడియోరీల్స్‌ను చత్రీకరించిన యువకులపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పరిషత్ సభ్యులు సొమవారం సదరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఐఐసీ ప్రశన్నకుమార్ బెహరాకు వినతిపత్రం సమర్పించారు. ప్రేమ్ పహాడ్ వద్ద కొలువై యున్న మహాకాళేశ్వర్ విగ్రహం (శివుని) వద్ద జిల్లాలోని హనుమంతపూర్ ప్రాంతానికి చెందిన సల్మాన్ దావాక అనే యువకుడితో కలసి మరో ఇద్దరు యువకులు అశ్లీలంగా వీడియోని చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిని తప్పుపట్టిన వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది హిందూ ధర్మఅనుచరులకు తీవ్ర బాధ కలిగిస్తుందని.. ఇటువంటి వీడియోలు, రీల్‌లుగా చిత్రీకరించి తమ పైశాచికత్వాన్ని చాటుకోవడమేనని వినతిపత్రంలో పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ రాయగడ శాఖ ఉపాధ్యక్షుడు ఆనందరావు, బజరంగ్ దళ్ కోఆర్డినేటర్ కె.జ్యొతి బెహర, శంకర్ బెహరా, అజయ్ అశ్రాణి, విజయ్ చూలేట్, మానస్ దాస్ వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.


