జయపురం సమితి స్థాయి పర్వ్
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఉత్సాహంగా..
జయపురం: జయపురం సమితి స్థాయి ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ 2025 సోమవారం ఉత్సాహంగా జరిగింది. మధ్యాహ్నం పట్టణ ప్రజల ఆరాధ్య దేవి శ్రీజగత్ జననీ మందిరంలో ఘనంగా పూజలు జరిపి దీప ప్రజ్వలనం చేశారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. యాత్రలో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలతో కళాకారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ పారాబెడ ప్రాంతంలోగల విక్రమ క్రీడామైదానం వరకు సాగింది. ఈ పొడియాలో పర్వ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందంగా ఏర్పాటు చేసిన వేదికపై జయపురం బీడీఓ శక్తి మహాపాత్రో అధ్యక్షతన జరిగిన ఉత్సవంలో ముఖ్యఅతిథిగా సమితి చైర్మన్ సస్మిత మెలక పాల్గొని సమితి స్థాయి పర్వ్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మరుగున పడిన కొరాపుట్ ఆదివాసీ ప్రతిభను ప్రోత్సహించి ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో చేస్తున్నదే జాతీయ ఆదివాసీ మహోత్సవం ప్రధాన లక్ష్యమన్నారు. ఉత్సవాల సందర్భంగా సమితి స్థాయిలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వీరిని జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు బిడిఓ శక్తి మహాపాత్రో వెల్లడించారు.
జయపురం సమితి స్థాయి పర్వ్
జయపురం సమితి స్థాయి పర్వ్
జయపురం సమితి స్థాయి పర్వ్


