పిచ్చోడి చేతిలో హతం
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ డైలీ మార్కెట్ వద్ద ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఓ హత్య జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరి సోగరియ అనే వ్యక్తి మతిస్థిమితం తప్పి వీధుల్లో తిరుగుతున్నాడు. ఆదివారం ఆయన కత్తితో తిరుగుతూ సనియా టక్రీ అనే యువకుడు కత్తితో మెడ కోసి పారిపోయాడు. సనియా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. గ్రామస్తులు రవిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సనియా మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.


