మాల్యవంత్ ఉత్సవాలకు శ్రీకారం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరిలో మాల్యవంత్ ఉత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలశ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారీ తాంగులు, సమితి అధ్యక్షురాలు గౌరి పడియామి, చిత్రకొండ సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి ఖిల్, కోరుకొండ సమితి అధ్యక్షుడు జితు బురుడి, బలిమెల ఎన్‌ఏసి చైర్మన్ ప్రదీప్ నాయక్, జిల్లా అదనపు కలెక్టర్ బెదబర్ ప్రధాన్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి నరేష్ చంద్ర సబర్, సబ్ కలెక్టర్ అశ్ని ఎ ఎల్, తదితరులు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. కలెక్టర్ మాల్యవంత్ పోస్టర్ ఆవిష్కరించారు. డిసెంబరు 14 నుంచి 18 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని కలెక్టర్ ఉపాధ్యాయ్ తెలిపారు. స్థానిక భైరవ మందిరం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి జరిగిన కలశ యాత్ర జగన్నాథ మందిరం వరకు కొనసాగింది.
ఆకట్టుకున్న ఆదివాసీ నృత్యాలు
ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిన దుస్తులతో ఆదివాసీలు వారి సంప్రదాయ ఆయుధాలతో కలశ యాత్రలో పాల్గొన్నారు. వారి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
మాల్యవంత్ ఉత్సవాలకు శ్రీకారం
మాల్యవంత్ ఉత్సవాలకు శ్రీకారం
మాల్యవంత్ ఉత్సవాలకు శ్రీకారం
మాల్యవంత్ ఉత్సవాలకు శ్రీకారం
మాల్యవంత్ ఉత్సవాలకు శ్రీకారం
మాల్యవంత్ ఉత్సవాలకు శ్రీకారం


