ముగిసిన కొరాపుట్ పర్వ్ 2025
జయపురం: జయపురం మున్సిపాలిటీ స్థాయి ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ 2025 ముగింపు వేడుకలు ఆదివాసీ సంస్కృతికి, కళలకు అద్దం పట్టాయి. ముగింపు వేడుకల వేదిక అలంకరణ గ్రామీణ వాతావరణాన్ని తలపింపచేసింది. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఆదివాసీ నృత్య, నాట్యాలు వారి కళాభిరుచిని వెల్లడించాయి. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి అధ్యక్షతన స్థానిక లక్ష్మణ నాయక్ స్మృతి భవనంలో జరిగిన పర్వ్ ముగింపు ఉత్సవంలో జయపురం సబ్‌కలెక్టర్, మున్సిలప్ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కొరాపుట్ పర్వ్ మార్గమన్నారు. కొరాపుట్ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు ప్రపంచానికి పరిచయం చేయటం ద్వారా కళాకారులకు గుర్తింపు తీసుకురావటం లక్ష్యంగా కొరాపుట్ పర్వ్ ఉత్సవాలు నిర్వహించినట్లు వెల్లడించారు. వివిధ పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతులు అందజేసి సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బి.సునీత, అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీస్ కాశ్యప్, జయపురం సమితి బీడీఓ శక్తి మహపాత్రో, తహసీల్దార్ సబ్యసాచి జెన, మున్సిపల్ ఇంజినీర్ అజయ్ జాని తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన కొరాపుట్ పర్వ్ 2025
ముగిసిన కొరాపుట్ పర్వ్ 2025


