రక్తదానంపై అపోహలు వీడాలి
పర్లాకిమిడి: గజపతి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో పర్లాకిమిడి పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీని ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఇన్‌చార్జి కలెక్టర్, ఏడీఎం మునీంద్ర హానగ విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. డిసెంబర్ 14వ తేదీన జరుగబోయే రక్తదాన శిబిరం దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి రక్తపు బింధువు అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమానికి నేను కూడా సహకరిస్తానని ఎమ్మెల్యే రూపేష్ అన్నారు. ఈ ర్యాలీ రాజవారి ప్యాలస్ నుంచి మార్కెట్ కూడలి మీదుగా.. జిల్లా ప్రధాన ఆస్పత్రి మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో గజపతి బ్లడ్ డోనర్స్ సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.రుషి, ఒన్ స్టాప్ సెంటర్ పరిపాలన అధికారిణి సునీతా రోథో, సస్మితా బెహరా, ఐ.ఎస్.ఆర్.డి మోహినీ ప్రదాన్, కై లాష్‌చంద్ర బిశ్వాళ్, సభ్యులు క్రాంతి కుమార్ బెహరా, శరత్‌కుమార్, నిహర్ కుమార్ పండా పాల్గొన్నారు.
రక్తదానంపై అపోహలు వీడాలి


